IPL 2023: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆర్సీబీ ఢీ కొట్టబోతున్నది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. రాజస్తాన్‌ ఒకే మార్పు చేసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లకీ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. 12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ మెరుగైన రన్ రేట్ కారణంగా టాప్ 3లోకి ఎంట్రీ ఇస్తుంది..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), జో రూట్, ధృవ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(సి), అనుజ్ రావత్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(w), మైకేల్ బ్రేస్‌వెల్, వేన్ పార్నెల్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్


Next Story

Most Viewed