IPL 2023: ఢిల్లీ ఢమాల్.. ఆర్సీబీ ఘన విజయం..

by Disha Web Desk 13 |
IPL 2023: ఢిల్లీ ఢమాల్.. ఆర్సీబీ ఘన విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా బెంగళూరు వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరగుతోన్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తడపడింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా, మిచెల్ మార్ష్ డకౌట్‌ అయ్యారు. ఢిల్లీ బ్యాటర్స్‌లో మనీశ్ పాండే (50) హాఫ్ సెంచరీ చేశాడు. వానిందు హసరంగ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్‌బీడబ్లూగా ఔటయ్యాడు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (19) పరుగుల వద్ద విజయ్ కుమార్ వైషక్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అక్షర్ పటేల్ (21) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో.. విజయ్ కుమార్ వైషక్ 3, మహ్మద్ సిరాజ్ 2, వేన్ పార్నెల్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు.

Next Story

Most Viewed