IPL 2023 మ్యాచ్ 5: RCB vs MI

by Malleboina Mahesh |

IPl 2023 లో భాగంగా క్రికెట్ అభిమానులకు అత్యంత ఫెవరేట్ టీమ్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.

IPL 2023 మ్యాచ్ 5: RCB vs MI
X

దిశ, వెబ్‌డెస్క్: IPl 2023 లో భాగంగా క్రికెట్ అభిమానులకు అత్యంత ఫెవరేట్ టీమ్స్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2 ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ కొట్టని RCB ఈసారైనా కప్పు కొట్టాలనే దృడ సంకల్పంతో బరిలోకి దిగుతుంది. అలాగే గత సీజన్‌లో 14 మ్యాచుల్లో కేవలం నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన ముంబై ఈ సారి తమ సత్తా ఏంటో చూపియడానికి సిద్ధం అయింది. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించడానికి ఇరు జట్లు సిద్ధం అయ్యాయి.

RCB ప్లేయింగ్ XI అంచనా జట్టు:- ఫాఫ్ డుప్లెసిస్ (సి), ఫిన్ అలెన్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లోమ్రోర్, మైఖేల్ బ్రేస్‌వెల్, దినేష్ కార్తీక్ (WK), షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, కర్ణ్ శర్మ, రీస్ టోప్లీ, మహ్మద్ సిరాజ్.

MI ప్లేయింగ్ XI అంచనా జట్టు:- రోహిత్ శర్మ (సి), ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్, టీమ్ డేవిడ్, హృతిక్ షో కిన్, జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికేయ, అర్షద్ ఖాన్, జాసన్ బెహ్రిండోర్ఫ్.

Next Story