IPL 2023: లక్నో vs చెన్నై మ్యాచ్ రద్దు..

by Disha Web Desk 13 |
IPL 2023: లక్నో vs చెన్నై మ్యాచ్ రద్దు..
X

దిశ, వెబ్‌డెస్క్:IPL 2023లో భాగంగా లక్నో వేదికగా చెన్నై, లక్నో మధ్య జరుగుతోన్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో వర్షం వల్ల మ్యాచ్‌ అర్థాంతరంగా రద్దైంది. వాన ఎంతకూ విడవకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో రెండు టీమ్స్‌కు చెరో పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్‌ నిర్ణీత 19.2 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 125 రన్స్ చేసింది. లక్నో బ్యాటర్స్‌లో ఆయుష్ బడోని (59) పరుగులు చేయగా.. నికోలస్ పూరన్ (20) పరుగులు చేశారు. చెన్నై బౌలర్‌లో.. మొయిన్ అలీ, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ 2 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 1 వికెట్ తీశాడు.



Next Story

Most Viewed