IPL 2023: లిట్టన్ దాస్ రీప్లేస్‌మెంట్ ప్రకటించిన కేకేఆర్..

by Vinod kumar |

ఫ్యామిలీ ఎమర్జెన్సీతో కేకేఆర్‌కు దూరమైన లిట్టన్ దాస్.. రీప్లేస్‌మెంట్‌ను కేకేఆర్ ప్రకటించింది.

IPL 2023: లిట్టన్ దాస్ రీప్లేస్‌మెంట్ ప్రకటించిన కేకేఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యామిలీ ఎమర్జెన్సీతో కేకేఆర్‌కు దూరమైన లిట్టన్ దాస్.. రీప్లేస్‌మెంట్‌ను కేకేఆర్ ప్రకటించింది. ఈ సిరీస్ మొత్తానికి ఆ కొత్త ప్లేయర్ జట్టుకు అందుబాటులో ఉండబోతోన్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీతో లిట్టన్ దాస్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో లిట్టన్ దాస్ స్వదేశానికి వెళ్లిపోయాడు. సిరీస్ మొత్తానికీ అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ నేపథ్యంలో లిట్టన్ స్థానంలో వెస్టిండీస్ వికెట్ కీపర్ జాన్సన్ ఛార్లెస్‌ను జట్టులోకి తీసుకుంది కోల్‌కత నైట్‌రైడర్స్. రూ. 50 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో అతణ్ని జట్టులోకి తీసుకుంది. జాన్సన్ ఛార్లెస్‌ ఇప్పటివరకు వెస్టిండీస్ తరఫున 41 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడగా.. 971 పరుగులు చేశాడు.

Next Story