IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టెబుల్‌లో టాప్-2 ఉన్న ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మూడు సార్లు తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ గుజరాత్ టైటాన్స్ గెలుపొందడం గమనార్హం. హెడ్ టు హెడ్ రికార్డ్‌లో చెన్నై 3-0తో ఆధిక్యంలో ఉంది. దాంతో మ్యాచ్‌లో ఒత్తిడంతా చెన్నైపైనే ఉంది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన గుజరాత్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. చెన్నై గెలిచింది 8 మ్యాచ్‌ల్లోనే. మంగళవారం క్వాలిఫయర్ -1లో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కి వెళ్లనుంది. ఓడిన జట్టుకి క్వాలిఫయర్ -2 రూపంలో ఫైనల్‌కి వెళ్లేందుకు మరో ఛాన్స్ ఉంటుంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(w), హార్దిక్ పాండ్యా(c), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

Next Story