IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు గుజరాత్ టైటాన్స్.. ఇదే పట్టికలో చిట్టచివరన ఉన్న టీం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం గుజరాత్ చాలా బలంగా కనిపిస్తోంది. ఓపెనర్‌గా గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సాహా, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో మహమ్మద్ షమీ, జోష్ లిటిల్ కూడా రాణిస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో గుజరాత్ చాలా బలంగా కనిపిస్తోంది.

మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌‌లో డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉండగా.. మిచెల్ మార్ష్ కూడా ఫామ్ అందుకున్నాడు. మనీష్ పాండే ఫర్వాలేదు అనిపిస్తుండగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా ఆడుతున్నాడు. మిడిలార్డర్‌లో ఢిల్లీ కొంత బలహీనంగా ఉండగా.. అక్షర్ పటేల్‌ను ముందు పంపిస్తే ఆ సమస్య తీరిపోతుంది. బౌలింగ్ విభాగంలో కూడా ఢిల్లీ మెరుగ్గానే ఉంది.. మార్ష్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెడతారు.

గుజరాత్ టైటాన్స్‌ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా (WK), విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (సి), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్ (సి), ఫిలిప్ సాల్ట్ (డబ్ల్యుకె), మనీష్ పాండే, రిలీ రోసోవ్, ప్రియమ్ గార్గ్, రిపాల్ పటేల్, అక్షర్ పటేల్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఇషాంత్ శర్మ.

Next Story

Most Viewed