IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. కీలక పోరుకు రంగం సిద్ధం

by Disha Web Desk 19 |
IPL 2023: టాస్ గెలిచిన ఢిల్లీ.. కీలక పోరుకు రంగం సిద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2023లో మరో రసవత్తర పోరుకు సమయం ఆసన్నమైంది. పటిష్టమైన ఢిల్లీ, లక్నో సూపర్ జైయింట్స్ మధ్య లక్నోలోని అటల్ బీహారి వాజ్ పేయి స్టేడియంలో ఇరుజట్ల మధ్య మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచింది. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

ఇరు జట్ల ప్లేయింగ్ లెవన్ వివరాలు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (c), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (w), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్



Next Story

Most Viewed