IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలుస్తుంది. గుజరాత్, చెన్నై మధ్య కూడా కేవలం ఒక్క పాయింట్ తేడా మాత్రమే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే టేబుల్ టాపర్‌గా చెన్నై నిలిచే అవకాశం కూడా ఉంది. కేకేఆర్ ఇంకా ప్లేఆఫ్స్ పోటీలో నామమాత్రంగానే ఉంది. రాజస్థాన్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయిన ఆ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్ రేసులో నుంచి తప్పుకుంది. ఇప్పుడు చెన్నై చేతిలో ఓడితే ఈ జట్టు కూడా ఢిల్లీ బాటలోనే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంటుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చకరవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ



Next Story

Most Viewed