IPL 2023: ఎదురీదుతోన్న సన్ రైజర్స్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్

by Disha Web Desk 19 |
IPL 2023: ఎదురీదుతోన్న సన్ రైజర్స్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌల్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎదురీదుతోంది. సొంత గ్రౌండ్‌లో పరుగులు చేయడానికి హైదరాబాద్ బ్యాటర్స్ చెమటోడ్చుతున్నారు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఆర్ఆర్ స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ భారీ దెబ్బ కొట్టాడు.

తొలి ఓవర్లోనే ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్స్ అభిషేక్ వర్మ, స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని ఔట్ చేయడంతో పాటు ఓవర్ మెయిడిన్ చేసి సన్ రైజర్స్‌ను కష్టాల్లోకి నెట్టాడు. రాజస్థాన్ బ్యాటర్స్ పరుగుల వరద పారించిన అదే పిచ్‌పై పరుగులు చేయడానికి ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు నానా తంటాలు పడుతున్నారు. రెండు ఓవర్లు ముగిసే సమయానికి హైదరాబాద్ రెండు వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ ఉన్నారు.

Read more:

IPL 2023: ఉప్పల్‌లో రఫ్పాడించిన రాజస్థాన్.. అల్లాడిన హైదరాబాద్ బౌలర్స్



Next Story

Most Viewed