సూర్యకుమార్ యాదవ్పై గంగూలీ ప్రశంసల జల్లు

by Dishafeatures2 |
సూర్యకుమార్ యాదవ్పై గంగూలీ ప్రశంసల జల్లు
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మేన్ సూర్య కుమార్ యాదవ్ పై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్, ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ ప్రపంచంలోనే గొప్ప టీ20 ప్లేయర్ అని ఆకాశానికెత్తారు. అతడి ఆటను చూస్తే కంప్యూటర్లో గేమ్ ను చూసినట్లుగా ఉంటుందని దాదా పేర్కొన్నారు. ఐపీఎల్ లో భాగంగా మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 35 బాల్స్ లోనే 83 పరుగులు చేసి ముంబైని గెలిపించాడు.

స్కై బ్యాటింగ్ ముందు ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు. గ్రౌండ్ చుట్టూ బంతిని పంపుతూ సూర్యకుమార్ యాదవ్ ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. అయితే ఈ సీజన్ మొదట్లో పరుగులు చేయడానికి సూర్యకుమార్ యాదవ్ చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో జట్టుకు ఆయన అవసరమా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే నిన్న ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్ లో దుమ్ములేపిన స్కై విమర్శకులు నోళ్లు మూయించాడు.

Read More: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200+ స్కోరును చేజ్ చేసిన ముంబై


Next Story