- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
అదరగొట్టిన ఢిల్లీ.. రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి
by Harish |
ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది.

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను మెరుగుపర్చుకుంది. రాజస్థాన్‌తో కీలక మ్యాచ్‌లో నెగ్గి టాప్-5కి చేరుకుంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 20 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 221/8 స్కోరు చేసింది. జేక్ ఫ్రేజర్(50), అభిషేక్ పొరెల్(65) హాఫ్ సెంచరీలతో రెచ్చిపోగా.. ట్రిస్టన్ స్టబ్స్(41) కూడా మెరవడంతో ఢిల్లీకి భారీ స్కోరు దక్కింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 201/8 స్కోరుకే పరిమితమై వరుసగా రెండో ఓటమిని పొందింది. కెప్టెన్ సంజూ శాంసన్(86) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును పోటీలోకి తీసుకొచ్చినా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం జట్టును నష్టం కలిగించింది.
Next Story






