చిన్నస్వామిలో దుమ్ములేపిన చెన్నై.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?

by Disha Web Desk 1 |
చిన్నస్వామిలో దుమ్ములేపిన చెన్నై.. బెంగళూరు టార్గెట్ ఎంతంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. చిన్నదైన చిన్నస్వామి స్టేడియంలో చెన్నై బ్యాటర్లు భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డారు. సిక్సర్ల సునామీతో ఆర్సీబీ బౌలర్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వారికి ఏడుపు ఒక్కటే తక్కువైంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. డేవాన్ కాన్వే (45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83), శివమ్ దూబే (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అదేవిధంగా వారికి అజింక్యా రహానే(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37) తోడయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాక్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్, సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Next Story

Most Viewed