ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించిన యువ బౌలర్

by Disha Web Desk 12 |
ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించిన యువ బౌలర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 యువ ప్లేయర్లకు బాగా కలిసి వస్తుంది. అలాగే తమను తాము నిరూపించుకోవడానికి మంచి సమయం దొరికింది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ లో యువ ప్లేయర్లు తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మొదటి ఎలిమినేటర్ మ్యాచులో లక్నో జట్టుపై ముంబై యువ బౌలర్ ఆకాష్ మధ్వల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు వేసిన మధ్వల్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో PL ప్లేఆఫ్స్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను ( 1.43 ఎకానమి రేటు) నమోదు చేశాడు. దీంతో అతను ముంబై విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. మధ్యల్ హైదరాబాద్‌తో జరిగిన కీలక మ్యాచులో కూడా.. కీలకమైన మూడు వికెట్లు తీసి హైదరాబాద్ జట్టు ఓటమికి కారణమయ్యాడు.



Next Story