అరె ఏంట్రా.. సడెన్ సర్పైజ్! రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని!

by Disha Web Desk 14 |
అరె ఏంట్రా.. సడెన్ సర్పైజ్!  రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అభిమానులు కొందరూ స్టేడియంలోని బారికేడ్లు దాటి గ్రౌండ్‌లో ఉన్న ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్‌ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం అందరూ చేసే ఉంటారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల బెంగళూరు మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీని అభిమాని వచ్చి ఆప్యాయంగా కాళ్లు మొక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ క్రమంలోనే మరో క్రికెట‌ర్‌కు అభిమాని సడెన్ సర్పైజ్ ఇచ్చాడు. నిన్న వాంఖడే స్టేడియంలో ఐపీఎల్-2024 14వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ - రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌రో విజయాన్ని సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను ఒక అభిమాని భ‌య‌పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అభిమాని బారికేడ్లు దాటి గ్రౌండ్‌లోకి వచ్చాడు. రోహిత్ శ‌ర్మ వైపు పరిగెత్తి వెనుక నుంచి స‌డెన్ గా రావ‌డంతో రోహిత్ ఉలిక్కిప‌డి భ‌య‌ప‌డ్డాడు. వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఈ అభిమాని రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల‌ను హ‌గ్ చేసుకునీ వచ్చేస్తాడు. పవర్ ప్లే సమయంలో అభిమాని గ్రౌండ్ లోకి దూసుకురావ‌డంతో రాజస్థాన్ ఛేజింగ్ సమయంలో ఆటకు కొన్ని నిమిషాలు బ్రేక్ పడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అరె ఏంట్రా.. హిట్ మ్యాన్‌కు సడెన్ సర్పైజ్‌ ఇచ్చి భయపెట్టావ్.. అని కామెంట్స్ చేస్తున్నారు. జొమాటో డెలివరి బాయ్ వచ్చి రోహిత్‌కు వడాపావ్ ఇచ్చిపోయడాని మరికొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed