- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WWEని తాకిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రేజ్
WWE డ్రూ మెకింటైర్ కూడా వైభవ్ సూర్య వంశీకి అభిమాని అయిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా వణుకిస్తున్నాడు. ప్లే ఆఫ్స్ దాకా రాజస్థాన్ రాయల్స్ చేరుకుందంటే, దానికి ముఖ్య కారణం వైభవ్ సూర్యవంశీ అని చెప్పవచ్చు. గత ఏడాది అడపాదడపా ఆడినప్పటికీ.. ఈ సారి మాత్రం అంతర్జాతీయ ప్లేయర్ లాగా రాణిస్తున్నాడు. దీంతో వైభవ్ సూర్య వంశీ పేరు సోషల్ మీడియాలో మారుమవుతోంది.
ఇండియాలోనే కాదు విదేశాల్లో కూడా వైభవ్ తన క్రేజ్ పెంచుకున్నాడు. ఒక లేటెస్ట్ గా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్ మెంట్ స్టార్ డ్రూ మెకింటైర్ కూడా వైభవ్ సూర్య వంశీకి అభిమాని అయిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైభవ్ జర్సీ ధరించి జిమ్ లో కసరత్తు చేస్తూ, వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోకు ‘చూజెన్ వన్’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో వైరల్ అయిన తరుణంలో OMG అంటూ RR కెప్టెన్ రియాన్ పరాగ్ రియాక్ట్ అయ్యారు. ఇది ఇలా ఉండగా, ఇవాళ ఎలిమినేటర్ లో వైభవ్ ఎలా ఆడతాడన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.






