IPL అభిమానుల‌కు షాక్‌..ఇవాళ్టి మ్యాచ్ కు కూడా మళ్లీ వర్షం అడ్డంకి!

by velandi.Saikiran |

IPL అభిమానుల‌కు షాక్‌..ఇవాళ అరుణ్ జైట్లీ వేదిక‌గా జ‌రిగే గుజ‌రాత్, ఢిల్లీ మ్యాచ్ కు కూడా మళ్లీ వర్షం అంత‌రాయం ఏర్ప‌డే ఛాన్స్ ఉంది.

IPL అభిమానుల‌కు షాక్‌..ఇవాళ్టి మ్యాచ్ కు కూడా మళ్లీ వర్షం అడ్డంకి!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ అభిమానులకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే రెండు మ్యాచ్ ల‌కు వర్షం విలన్ గా మారగా, ఇవాళ జరిగే ఢిల్లీ, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు కూడా అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఢిల్లీ, గుజరాత్ మధ్య ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు అరుణ్ జైట్లీ వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభం కాక ముందు సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీలో వర్షం ప్రారంభమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇవాళ జరిగే మ్యాచ్ పైన ఈ ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది.

వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటే..!

సాయంత్రం 7:30 గంటల వరకు వర్షం కొనసాగితే టాస్ నిన్నటి లాగా లేట్ కావచ్చు. ఒకవేళ వర్షం విపరీతంగా పడితే మ్యాచ్ కూడా రద్దు అయ్యే ప్రమాదం ఉంది. లేదా అర్ధరాత్రి మ్యాచ్ స్టార్ట్ అయి, 11 ఓవర్లు లేదా ఐదు ఓవర్ల చొప్పున నిర్వహించే అవకాశాలు కూడా ఉంటాయి. చివర‌కు సూపర్ ఓవర్ అయినా నిర్వహించే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా వర్షం పడుతుందని వార్త రాగానే క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటే.. ఇలా వరుణుడు విలన్ గా మారుతున్నాడని ఎమోషనల్ అవుతున్నారు.

Next Story