IPL 2026: క్వాలిఫైయర్ మ్యాచులు రద్దయితే విజేత ఎవరు?

by velandi.Saikiran |

IPL 2026: క్వాలిఫైయర్ మ్యాచులు రద్దయితే విజేత‌ల‌ను రూల్స్ ప్ర‌కారం ఫైన‌ల్ చేస్తారు.

IPL 2026: క్వాలిఫైయర్ మ్యాచులు రద్దయితే విజేత ఎవరు?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా నేటి నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు షురూ కాబోతున్నాయి. ఇవాళ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. రేపు ఎలిమినేటర్ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మధ్య ఉంటుంది. అయితే ఈ ప్లే ఆఫ్స్ నేపథ్యంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ లు రద్దు అయితే, ఎలాంటి రిజర్వ్ డేలు లేవని బీసీసీఐ వెల్లడిస్తోంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు మాత్రమే రిజర్వ్ ప్రకటించారు.

అయితే ఈ ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు జరిగేటప్పుడు వర్షం లేదా ఏదైనా కారణాలతో మ్యాచ్ ఆలస్యం అయితే అదనంగా రెండు గంటల సమయం కేటాయించనున్నారు. కనీసం 5 ఓవర్లు ఆడించడానికి అంపైర్లు ప్రయత్నించనున్నారు. అది కుదరకపోతే సూపర్ ఓవర్ నిర్వహించి, విజేతను ప్రకటిస్తారు. సూపర్ ఓవర్ కూడా నిర్వహించని పరిస్థితి నెలకొంటే, పాయింట్స్ టేబుల్ లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచ్లకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. ఫైనల్ కు మాత్రం రిజర్వ్ డే ఉండనుంది.

Next Story