గంటకు 154.2 కిలో మీటర్ల వేగం.. ఎవరీ అశోక్ శర్మ?

by velandi.Saikiran |

ఐపీఎల్ 2026 ఫాస్టెస్ట్ బంతి వేసిన అశోక్ శర్మ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడు.

గంటకు 154.2 కిలో మీటర్ల వేగం.. ఎవరీ అశోక్ శర్మ?
X

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ టైటాన్స్ ఆటగాడు, సెన్సేషనల్ బౌలర్ అశోక్ శర్మ ( Ashok Sharma) పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో మారు మోగుతోంది. శనివారం రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 16వ ఓవర్ అశోక్ శర్మ వేశాడు. ఈ క్రమంలో 154.2 కిలోమీటర్ల వేగంతో చివరి బంతిని సంధించాడు. దీంతో ఐపీఎల్ 2026లో ఫాస్టెస్ట్ బంతివేసిన బౌలర్ గా రికార్డులోకి ఎక్కాడు. ఇదే అశోక్ శర్మ... ప్రతి బంతిని 148 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో విసురుతాడు. అందుకే ఇప్పుడు అశోక్ శర్మ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అశోక్ శర్మ బ్యాక్ గ్రౌండ్ ఇదే

ఐపీఎల్ 2026 ఫాస్టెస్ట్ బంతి వేసిన అశోక్ శర్మ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడు. జైపూర్ లోని ఓ రైతు కుటుంబంలో జన్మించాడు అశోక్ శర్మ. రాజస్థాన్ కు నెట్ బౌలర్ గా మొదట ఎంపికయ్యాడు. అతని ప్రదర్శన బాగున్న నేపథ్యంలో ఐపీఎల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో 2022 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ సందర్భంగా కేకేఆర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2025లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో కూడా ఉన్నాడు. ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ రూ. 90 లక్షలకు అశోక్ శర్మను కొనుగోలు చేసింది. ఇత‌ని వ‌య‌స్సు కేవ‌లం 23 ఏళ్లు మాత్ర‌మే. ఈ సీజ‌న్ లో ప్రతి మ్యాచ్ లో కూడా అవకాశం దక్కించుకుంటున్నాడు అశోక్ శర్మ.

Next Story