- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది? ఐపీఎల్ ఫేక్ ప్రిడిక్షన్ల ఉచ్చు : సజ్జనార్ హెచ్చరిక
ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్, ఫేక్ ప్రిడిక్షన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌ను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్, ఫేక్ ప్రిడిక్షన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను పంచుకుంటూ సైబర్ నేరగాళ్లు, ఇన్ఫ్లుయెన్సర్ల తీరును వివరించారు. డబ్బు కోసం కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు అసత్య ప్రచారాలు చేస్తూ సామాన్యులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘టాస్ ఎవరిది? మ్యాచ్ ఏ టీమ్ గెలుస్తుంది?’ అని ముందే చెబుతామంటూ తమ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేయించుకుని అమాయకులను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారని తెలిపారు. ఇలాంటి ఫేక్ ఛానెళ్ల మాటలు నమ్మి కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు.
సైబర్ క్రైమ్ పోలీసుల కొరడా.. ఫిర్యాదు చేయండిలా
బెట్టింగ్ ప్రమోషన్ల విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని సజ్జనార్ తెలిపారు. ఇందులో భాగంగానే గత నెల రోజుల్లో 494 పెయిడ్ ప్రకటనలను, వాటిని ప్రచారం చేస్తున్న 129 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయించినట్లు వెల్లడించారు. ఈ నిఘా నిరంతరం కొనసాగుతుందని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు దృష్టికి వచ్చినా, మోసపోయినా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






