భారీ వ‌ర్షం...కేకేఆర్‌, ముంబై మ్యాచ్ కు అంత‌రాయం !

by velandi.Saikiran |

కేకేఆర్‌, ముంబై మ్యాచ్ కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం.

భారీ వ‌ర్షం...కేకేఆర్‌, ముంబై మ్యాచ్ కు అంత‌రాయం !
X

దిశ‌, వెబ్ డెస్క్: మరికాసేపట్లో కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభం కంటే ముందే, కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ లో కాసేపటికి క్రితమే వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో మైదానం మొత్తం కవర్స్ తో కప్పేశారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. వర్షం పడుతున్న నేపథ్యంలో టాస్ కాస్త ఆలస్యంగా వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వర్షం బాగా పడితే, ఓవర్లు కుదిస్తారని అంటున్నారు. కానీ మ్యాచ్ మాత్రం జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ కాగా, ప్లే ఆఫ్స్ లో భాగంగా నాలుగో స్థానం కోసం కేకేఆర్ పోరాడుతూనే ఉంది.

Next Story