విరాట్ కోహ్లీ డ‌కౌట్...9 ఏళ్ల త‌ర్వాత తొలిసారి!

by velandi.Saikiran |   (  Updated:2026-05-07 18:10:25  IST  )

ల‌క్నో వ‌ర్సెస్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు.

విరాట్ కోహ్లీ డ‌కౌట్...9 ఏళ్ల త‌ర్వాత తొలిసారి!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో తొలిసారిగా విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ వస్తున్న కోహ్లీ... లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తడబడ్డాడు. ఈ మ్యాచ్ లో రెండు బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో పరుగులేమి చేయకుండా క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఈ సందర్భంగా వికెట్ కోల్పోయిన‌ విరాట్ కోహ్లీ బిత్తర పోయాడు.

అటు కింగ్ వికెట్ తీసిన సంబరంలో ప్రిన్స్ యాదవ్ చేసిన సెల‌బ్రేష‌న్స్‌ వైరల్ గా మారాయి. ఐపీఎల్ హిస్ట‌రీలో ఛేజింగ్ చేసే క్ర‌మంలో కోహ్లీ 9 ఏళ్ల (2017) త‌ర్వాత డ‌కౌట్ అయ్యాడు. బెంగళూరు, LSG మధ్య గురువారం మ్యాచ్ జరగగా.. ఇందులో రిషబ్ పంత్ సేన ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో 19 ఓవర్లు ఆడిన లక్నో, మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు సాధించింది. మిచెల్ మార్ష్ సెంచరీ చేయగా చివరిలో రిషబ్ పంత్ మెరుపులు మెరిపించాడు. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయింది బెంగళూరు. ప్ర‌స్తుతం ర‌జ‌త్, ప‌డిక్క‌ల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

Next Story