రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. 9 సెంచరీలతో స‌రికొత్త చ‌రిత్ర‌

by velandi.Saikiran |   (  Updated:2026-05-14 01:34:01  IST  )

విరాట్ కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ.

రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ.. 9 సెంచరీలతో స‌రికొత్త చ‌రిత్ర‌
X

దిశ‌, వెబ్ డెస్క్: కేకేఆర్ వర్సెస్ బెంగళూరు మధ్య బుధవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన బెంగుళూరు 6 వికెట్ల‌ తేడాతో విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 58 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా బద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ.

14 వేల పరుగుల మైలురాయిలో కోహ్లీ

టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. 403 మ్యాచ్ ల‌లో ఈ ఘనత అందుకున్నాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ తర్వాత క్రిస్ గేల్ అత్యంత వేగంగా 14 వేల పరుగులు సాధించాడు. 423 ఇన్నింగ్స్ లలో క్రిస్ గేల్ ఈ మైలురాయి అందుకున్నాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 431, జోస్ బ‌ట్ల‌ర్ 468 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధించారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు

19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు కోహ్లీ. ఇప్పటి వరకు 9 సెంచరీలు ఫినిష్ చేశాడు. అంతేకాదు ఒకే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరుపైన ఉంది. 2016లో ఏకంగా నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. ఐపీఎల్ లో కోహ్లీ అత్య‌ధిక సెంచ‌రీలు చేయ‌గా ఆయ‌న త‌ర్వాత జోస్ బట్లర్ 7, క్రిస్ గేల్ 6, కెఎల్ రాహుల్ 6, సంజు శాంసన్ 5 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ధోని, రోహిత్ శర్మ రికార్డు బద్దలు

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2008 నుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 279 మ్యాచ్ లు ఆడాడు. మొన్నటి వరకు ధోని (278), రోహిత్ శర్మ (278) ఇద్దరూ కోహ్లీ కంటే ముందు ఉండగా... వాళ్ల రికార్డు తాజాగా బ్రేక్ చేశాడు. ఇక నాలుగో స్థానంలో రవీంద్ర జడేజా ( 265) ఉండగా ఐదవ స్థానంలో దినేష్ కార్తీక్ ( 257) ఉన్నారు. విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఆడిన 279 మ్యాచ్ లు కూడా బెంగళూరు తరఫున ఆడడం గమనార్హం. లీగ్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు ఒకే జట్టుకు ఇన్ని మ్యాచులు ఆడలేదు.

Next Story