ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..ఇవాళ రాత్రే ప్ర‌క‌ట‌న ?

by velandi.Saikiran |

ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్లు పోస్టులు వైర‌ల్ చేస్తున్నారు.

ఐపీఎల్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..ఇవాళ రాత్రే ప్ర‌క‌ట‌న ?
X

దిశ‌, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ గురించి ఆసక్తి కర న్యూస్ వైరల్ గా మారింది. ఇవాళ ఫైనల్ ముగియగానే, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టెస్టులు, టీ20 లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటు ఐపీఎల్ లో బెంగుళూరు తరఫున కోహ్లీ ఆడుతున్నాడు.

ఇవాళ ఫైనల్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ పూర్తికాగానే రిటైర్మెంట్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు విరాట్ కోహ్లీ గురించి ఓ ప్రచారమైతే జోరుగా సాగుతోంది. ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి, రిలాక్స్ కావాలని అనుకుంటున్నాడట కోహ్లీ. అటు 2027 వరల్డ్ కప్ పైన ఫోకస్ కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా 19 ఏళ్లుగా ఆర్సీబీ త‌ర‌ఫున కోహ్లీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈ సీజ‌న్ కోసం ఏకంగా రూ.21 కోట్లు తీసుకుంటున్నాడు.

Next Story