RCBకి బిగ్ షాక్‌...ప్లే ఆఫ్స్ లో కోహ్లీకి చెత్త రికార్డులు !

by velandi.Saikiran |

RCBకి బిగ్ షాక్‌...ప్లే ఆఫ్స్ లో కోహ్లీకి చెత్త రికార్డులు ఉన్నాయి. ఈ అంశం ఇప్పుడు ఆర్సీబీ క‌ల‌వ‌ర‌పెడుతోంది.

RCBకి బిగ్ షాక్‌...ప్లే ఆఫ్స్ లో కోహ్లీకి చెత్త రికార్డులు !
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్లే ఆఫ్స్ లో భాగంగా మరికాసేపట్లో బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగుళూరు జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్ దశలో విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా పెద్దగా రాణించలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 17 ప్లే ఆఫ్స్ మ్యాచులలో విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించాడు.

ఈ క్రమంలో 396 పరుగులు సాధించాడు. 26.4 యావరేజ్ సాధించిన విరాట్ కోహ్లీ, 121 స్ట్రైక్ రేట్ మాత్రమే మైంటైన్ చేశాడు. అతని హైయెస్ట్ స్కోర్ 70 పరుగులు మాత్రమే. ఈ 17 ఇన్నింగ్స్ లలో కేవలం రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. ఒక్క సెంచరీ కూడా లేదు. అంతేకాదు ఈ ప్లే ఆఫ్స్ లలో ఒక్కసారి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న దాఖలాలు కూడా లేవు. ఈ అంశం ఇప్పుడు బెంగుళూరు జట్టును కలవరపెడుతోంది. మరి ఇవాళ అయినా కోహ్లీ రాణిస్తాడా? ఎప్పటిలాగే విఫలమవుతాడా? అనేది చూడాలి.

Next Story