- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు
ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీ ( Virat Kohli) పేరు వినగానే రికార్డులు, హిస్టరీలు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కోహ్లీ ఒక్క పరుగు చేసినా ఏదో ఒక రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా ఐపీఎల్ లో సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్ టోర్నమెంట్ లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్ గా నిలిచాడు. 275 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు నెలకొల్పాడు. ఇందులో 66 అర్థ సెంచరీలు ఉండగా, ఎనిమిది సెంచరీలు నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.
ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్లు వీళ్లే
ఇక విరాట్ కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ పరుగులను 276 మ్యాచ్ లలో సాధించాడు రోహిత్. అంటే రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ బెటర్ ప్లేయర్ అన్నట్లుగా ఈ రికార్డులు చెబుతున్నాయి. ఈ ఇద్దరి తర్వాత శిఖర్ ధావన్ 6,769 పరుగులు చేయగా డేవిడ్ వార్నర్ 6,565 సాధించాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 5,580 పరుగులతో ఐదవ స్థానంలో ఉన్నాడు.






