- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవ్ సూర్యవంశీ జాతకం చెప్పిన వేణు స్వామి
వైభవ్ సూర్యవంశీ జాతకం చెప్పిన వేణు స్వామి..అతడు ఓ రేంజ్ కు వెళతాడని అంచనా వేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామినే సెలబ్రిటీగా మారిపోయారు. అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు విడాకులు తీసుకుంటారని ముందుగానే అంచనా వేసి చెప్పి వేణు స్వామి పాపులర్ అయ్యారు. అయితే అలాంటి వేణు స్వామి, తాజాగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ జాతకం రివీల్ చేశాడు.
వైభవ్ జాతకంలో అన్ని ఆటంకాలే - వేణు స్వామి
వైభవ్ జాతకంలో అన్ని ఆటంకాలే ఉన్నాయని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీది ధనస్సు రాశి అని వెల్లడించారు. అతని జాతకం ప్రకారం క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ కంటే తోపు ప్లేయర్ అవుతాడని తెలిపారు. కానీ కొన్ని రాజకీయాల కారణాల వల్ల అతని కెరీర్ అంతమయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇండియాలో పాలిటిక్స్ ఎక్కువ అని, బీసీసీఐ సెలక్షన్ చేసే ప్రక్రియలో రాజకీయ జోక్యం ఉంటుందని ఆరోపణలు చేశారు.
దాని వల్ల వైభవ్ సూర్య వంశీకి అవకాశాలు రాబోవు అని తెలిపారు. అయితే ఈ పాలిటిక్స్ ను మేనేజ్ చేయగలిగితే వైభవ్ సూర్యవంశీని ఆపడం ఎవరి తరం కాదని తెలిపారు. మరో ఆరు నెలల్లో వైభవ్ సూర్య వంశీ కెరీర్ టర్న్ తీసుకుంటుందని అంచనా వేశారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ఇదే ఊపును కొనసాగిస్తూ, పెద్ద బౌలర్లను కూడా చీల్చి చెండాడుతాడని స్పష్టం చేశారు. కానీ ఇండియన్ పాలిటిక్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు.






