వైభవ్ సెంచ‌రీ మిస్‌...గుజ‌రాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే ?

by velandi.Saikiran |   (  Updated:2026-05-29 16:03:27  IST  )

హార్ట్ బ్రేక్ మూమెంట్...మ‌ళ్లీ వైభవ్ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు.

వైభవ్ సెంచ‌రీ మిస్‌...గుజ‌రాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే ?
X

దిశ‌, వెబ్ డెస్క్: క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. అయితే ఎలిమినేటర్ తరహాలోనే తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. మొన్నటి మ్యాచ్ లో 97 పరుగులు చేసిన వైభవ్, నేడు 96 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో వరుసగా రెండోసారి వైభవ్, సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇవాళ్టి మ్యాచ్ లో కగిసో రబాడ వేసిన ఓ అద్భుతమైన బంతిని సిక్సర్ మలిచేందుకు ప్రయత్నించి, ప్రసిద్ద్ కృష్ణకు దొరికిపోయాడు. దీంతో వైభవ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

గుజ‌రాత్ ముందు భారీ టార్గెట్

క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 214 ప‌రుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సెంచరీ మిస్ చేసుకోగా.. రవీంద్ర జడేజా 45 పరుగులతో రాణించాడు. చివరలో వచ్చిన ఫెరీరా 11 బంతుల్లో 38 పరుగులు సాధించి దుమ్ము లేపాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో రాజ‌స్థాన్ విధించిన టార్గెట్ ఛేదిస్తేనే, గిల్ సేన ఫైన‌ల్స్ దూసుకువెళుతుంది. లేక‌పోతే, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఫైన‌ల్స్ లో అడుగుపెట్ట‌నుంది.

Next Story