- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. ఒకే ఓవర్ లో 24 రన్స్
వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు.. ఒకే ఓవర్ లో 24 రన్స్ సాధించాడు.

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్ల మధ్య ఇవాళ జరుగుతున్న మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. లక్నో భారీ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే ఓవర్ లో 24 పరుగులు సాధించాడు వైభవ్. ఈ మ్యాచ్ సందర్భంగా ఆకాశ్ మహరాజ్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ లో ఏకంగా 24 పరుగులు దండుకున్నాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉండగా మూడు బౌండరీలు ఉన్నాయి. రెండు వైడ్లతో కలిపి ఓవర్ లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అదే సమయంలో తన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించాడు 15 ఏళ్ల వైభవ్. అటు ఆరంభంలో యశస్వి జైశ్వాల్ దాటిగా ఆడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ, జురెల్ ఇద్దరూ దూకుడుగా ఆడుతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో లక్నో మొదట బ్యాటింగ్ చేసి 220 పరుగులు సాధించింది.






