Vaibhav Sooryavanshi: వైభ‌వ్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక !

by velandi.Saikiran |   (  Updated:2026-04-01 12:28:18  IST  )

ఇంగ్లాండ్ సిరీస్ కోసం వైభవ్ సూర్య వంశీని ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని సమాచారం.

Vaibhav Sooryavanshi: వైభ‌వ్ కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఇంగ్లాండ్ సిరీస్ కు ఎంపిక !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఐపీఎల్ కారణంగా 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Sooryavanshi) పాపులర్ అయ్యాడు. 13 సంవత్సరాలకే ఐపీఎల్ లో అడుగుపెట్టిన ఇతను...ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున దుమ్ము లేపుతున్నాడు. కిందటి సీజన్ లో ఓ అద్భుతమైన సెంచరీ చేసిన నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ, పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత అండర్ 19 జట్టులో కూడా అదరగొట్టాడు. మొన్నటికి మొన్న ఎమర్జింగ్ ఆసియా కప్ లో కూడా బరిలోకి దిగి పరుగుల వర్షం కురిపించాడు. అయితే మూడు రోజుల కిందట 15వ పుట్టిన రోజు చేసుకున్న వైభవ్ సూర్య వంశీకి బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు.

వైభవ్ సూర్య వంశీకి బంపర్ ఆఫర్

ఈ సంవత్సరంలో జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ కోసం వైభవ్ సూర్య వంశీని ఎంపిక చేసేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని సమాచారం. 15 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడే అర్హత సంపాదించాడు వైభవ్. అందుకే అతన్ని జట్టులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఐపీఎల్ 2026లో దానికి తగ్గట్టుగానే వైభవ్ ఇరగదీస్తే.. కచ్చితంగా జట్టులోకి వస్తాడని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మొదటి మ్యాచ్ లో 15 బంతుల్లో అర్ధ‌ సెంచ‌రీ చేసి, ఆక‌ట్టుకున్నాడు వైభవ్. కాగా, భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జూలైలో 5 టీ20లు జ‌రుగ‌నున్నాయి.

ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక చేయండి

15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీపై మైఖేల్ వాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఇంగ్లాండ్ సిరీస్ కోసం వైభ‌వ్ ను సెల‌క్ట్ చేయాల‌ని కోరారు వాన్‌. అత‌నికి మంచి భ‌విషత్తు ఉంద‌న్నారు.

Next Story