ఇరాన్‌తో యుద్ధం ఆపేశాం : అమెరికా

by velandi.Saikiran |   (  Updated:2026-05-01 20:00:34  IST  )

ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది.

ఇరాన్‌తో యుద్ధం ఆపేశాం : అమెరికా
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది. యుద్ధం నిలిపివేసినట్లు అమెరికా కాంగ్రెస్ కు కూడా సమాచారం అందించింది. 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం కొనసాగించాలంటే, వారు ప్రారంభమైన 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ గడువు నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా చేసిన ప్రకటన వైరల్ గా మారింది.

ఇరాన్ డ్రోన్లు భస్మం

ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయిల్ తన అత్యాధునిక ఐరన్ బీమ్ లేజర్ ఆయుధాన్ని యూఏఈ కి పంపినట్లు తెలుస్తోంది. డ్రోన్లు, క్షిప‌ణులను క్షణాల్లోనే కరిగించే శక్తి ఈ లేజర్ సిస్టంకు ఉంటుంది. అబ్రహం ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో జరిగిన అతిపెద్ద సహకారం ఇదే కావడం విశేషం. ఐరన్ డోమ్ తో పాటు స్పెక్ట్రో అనే నిఘా వ్యవస్థను అందిస్తుంది అన్నమాట. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్త వంతంగా కూల్చేయ‌డంలో వీటిదే కీల‌క‌ పాత్ర.

Next Story