- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPLలో తెలుగు కుర్రాడి అరంగేట్రం..కేంద్ర మంత్రి ప్రశంసలు
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగగా తెలుగు కుర్రాడు త్రిపురాన విజయ్ కి అవకాశం దక్కింది. అయితే ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన త్రిపురాన విజయ్ పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీకాకుళం నేల ఎప్పుడూ ప్రతిభకు, పట్టుదలకు నిలయమే అని పేర్కొన్నారు. మన జిల్లా యువకుడు ప్రతిష్టాత్మక వేదికపై నిలవడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
అడ్డంకులను ఛేదించి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్పష్టం చేశారు. అంకిత భావం, క్రమ శిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇక నిన్న తన అరంగేట్ర మ్యాచ్ ఆడిన త్రిపురాన విజయ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నాడు. అయినప్పటికీ రాజస్థాన్ పైన ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం గెలిచింది.
Congratulations to Tripurana Vijay, our local boy from Srikakulam, on making his IPL debut — the first of many more milestones to come. Wishing him the very best for an exciting journey ahead. Play bold, stay grounded, and continue inspiring the youth.
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) May 18, 2026
The youth of Srikakulam… pic.twitter.com/sQ69bs7Lbd






