- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు
by velandi.Saikiran |
సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: సూపర్ సండే నేపథ్యంలో ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ సీజన్ లో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేందుకు మరోసారి రెడీ అయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు కేకేఆర్ తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు.
ఇందులో హైదరాబాద్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్ కు మరింత చేరువ కానుంది. అటు ఇవాళ రాత్రి 7:30 గంటలకు గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడుతుంది. గత మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ టేబుల్ టాపర్ గా కొనసాగుతున్న పంజాబ్, గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధిస్తే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇవాళ జరిగే రెండు మ్యాచ్ లను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
Next Story






