- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో ఫస్ట్ టైమ్.. ఒకే టీమ్‌లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్స్
ఒకే టీమ్‌లో ముగ్గురు ఇండియన్ కెప్టెన్స్ కలిగి ఉన్న జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో ముంబై ఇండియన్స్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. ఒకే సీజన్ లో ముగ్గురు భారత జట్టు ఆటగాళ్లు కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. 2008లో ముంబై ఇండియన్స్ కు హార్భజన్ సింగ్, పొలాక్, సచిన్ టెండూల్కర్ ముగ్గురు కూడా కెప్టెన్లుగా వ్యవహరించారు. అలాగే 2013లో పూణే జట్టుకు మాథ్యూస్, టేలర్, ఆరోన్ పించ్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఇక 2021లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇటు 2024 లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్లుగా గా శిఖర్ ధావన్, సామ్ కరన్, జితేష్ శర్మ వ్యవహరించారు. అయితే ఈ సీక్వెన్స్ లో ఎవరో ఒకరు విదేశీ ప్లేయర్ ఉన్నారు. కానీ ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ముగ్గురు కూడా భారత జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా కెప్టెన్లుగా వ్యవహరించారు. దీంతో ముంబై ఇండియన్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది.






