- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యకుమార్ యాదవ్ కు షాక్.. !
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై వేటు వేసేందుకు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: భారత టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కు ఊహించని షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతని కెప్టెన్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎసరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కాలంలోనే టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీని అందించిన సూర్య కుమార్ యాదవ్, బ్యాటింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీపై వేటు వేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ సంవత్సరం జూన్, జులై మాసాలలో ఇంగ్లాండ్, ఐలాండ్ తో టీ20 సిరీస్ లు ఆడనుంది భారత జట్టు. ఈ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ ఎలా ఆడతారు ? అనే దానిపైన బీసీసీఐ దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. అక్కడ సూర్య కుమార్ యాదవ్ పర్ఫామెన్స్ బెటర్ అయితేనే, భవిష్యత్తులో కెప్టెన్ గా కొనసాగుతాడని అంటున్నారు. లేకపోతే ఈ రెండు టీ20 సిరీస్ ల తర్వాత అతని కెప్టెన్సీ గల్లంతు అయ్యే ప్రమాదం ఉందని సమాచారం అందుతోంది.






