- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఒక్కటి చేస్తే, CSK కు మరో టైటిల్ పక్కా!
రుతురాజ్ ఓపెనర్ గా కాకుండా, మూడో స్థానంలో బరిలోకి దిగాలని సురేష్ రైనా సూచనలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ పై మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే చెన్నై పుంజుకుంటోందని వెల్లడించారు. మహేంద్ర సింగ్ ధోని అందుబాటులో లేకపోయినప్పటికీ, యంగ్ చెన్నై అదరగొడుతోందని ప్రశంసించాడు. అయితే ప్రస్తుతం తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉంటే, కెప్టెన్ రుతురాజ్ కు కీలక సూచనలను చేసే వాడినని సురేష్ రైనా వెల్లడించారు.
బ్యాటింగ్ ఆర్డర్ మార్చితే, చెన్నైకి తిరుగుండదు
రుతురాజ్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలని.. ఓపెన్ ఆయుష్ మాత్రేను బరిలోకి దించాలని సూచనలు చేసేవాడినని స్పష్టం చేశారు రైనా. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మార్చితే చెన్నై సూపర్ కింగ్స్, ఈ సారి టైటిల్ నెగ్గడం గ్యారెంటీ అన్నారు. దీంతో సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు వైరంగా మారాయి. కాగా ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్ లలో చెన్నై గెలవగా, మూడింటిలో ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో CSK 8వ స్థానంలో కొనసాగుతోంది. మొదటి స్థానంలో రాజస్థాన్ ఉండగా చివరన కేకేఆర్ నిలిచింది.






