- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంజాబ్ కింగ్స్ పై హైదరాబాద్ భారీ విజయం
పంజాబ్ కింగ్స్ పై 33 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విక్టరీ కొట్టింది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఏకంగా 33 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది SRH. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ హైదరాబాద్ మొదటి స్థానానికి చేరుకుంది. అటు పంజాబ్ కింగ్స్ ఓటమి పాలై, రెండో స్థానానికి పడిపోయింది.
33 పరుగుల తేడాతో హైదరాబాద్ బిగ్ విన్
పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా టాస్ ఓడిపోయిన హైదరాబాద్, ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముందు నుంచి పంజాబ్ కింగ్స్ తడబడింది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్, 202 పరుగులు మాత్రమే సాధించింది. కూపర్ సెంచరీ సాధించినప్పటికీ పంజాబ్ కు ఓటమి తప్పలేదు. దీంతో 33 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది SRH. మరో విజయాన్ని సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.






