- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైభవ్ సెంచరీ మిస్..SRH టార్గెట్ ఎంతంటే ?
నిర్ణీత 20 ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్, 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా SRH, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. ముల్లాన్ పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ, జురెల్ ఇద్దరూ అద్భుతంగా రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్, 8 వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్య వంశీ 29 బంతుల్లో 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ రాజస్థాన్ కు మాత్రం భారీ స్కోర్ అందించాడు. ఆ తర్వాత జురెల్ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అటు కెప్టెన్ రియాన్ పరాజ్ 26 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్ 29 పరుగులతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ విధించిన టార్గెట్ ను 20 ఓవర్స్ లో ఛేదిస్తేనే... టోర్నమెంట్ లో SRH నిలుస్తుంది. లేకపోతే మనోళ్లు ఇంటికి వెళ్లాల్సిందే. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ శర్మ, క్లాసేన్ లాంటి హిట్టర్స్ ఉన్నారు కాబట్టి, ఆ టార్గెట్ ను ఛేదించడం ఈజీనే అంటున్నారు. మరి ఛేజింగ్ లో హైదరాబాద్ ఎలా రాణిస్తుందో చూడాలి.






