ఉప్పల్‌లో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్.. సొంత మైదానంలో SRH భారీ స్కోరు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-13 15:54:04  IST  )

ఐపీఎల్ 2026లో భాగంగా సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు.

ఉప్పల్‌లో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్.. సొంత మైదానంలో SRH భారీ స్కోరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ(0) తొలి ఓవర్ మొదటి బంతికే అవుట్ కావడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. వికెట్ పడినా ఏమాత్రం తగ్గని ట్రావిస్ హెడ్ (18), ఇషాన్ కిషన్ రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ పోటీ పడి ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ఇషాన్ కిషన్ (91) అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, కేవలం 9 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకుని అభిమానులను నిరాశపరిచాడు. మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్(40) తనదైన శైలిలో సిక్సర్లతో విరుచుకుపడగా, యంగ్ సెన్సేషన్ నితీష్ కుమార్ రెడ్డి(28), అరోరా(24) చివర్లో మెరుపులు మెరిపించారు. 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగనున్న రాజస్థాన్ రాయల్స్‌ను హైదరాబాద్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారో చూడాలి. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ రెండు, సందీప్, తుషార్, పరాగ్ తలో వికెట్ తీశారు.

Next Story