- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించిన సన్ రైజర్స్
ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ రికార్డుల మోత మోగించింది. ఒకే సీజన్‌లో 500+ రన్స్ చేసిన త్రయంగా అభిషేక్, క్లాసెన్, ఇషాన్ నిలిచారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సంచలన రికార్డులను సృష్టించింది. ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు పరుగుల విధ్వంసం సృష్టించి రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌తో ఒకే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బ్యాటర్లు 500కు పైగా పరుగులు సాధించిన అరుదైన ఫీట్‌ను సన్‌రైజర్స్ అందుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ స్టార్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ ఈ మైలు రాయిని దాటి రికార్డు పుస్తకాల్లోకెక్కారు. అంతకుముందు 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ తొలిసారిగా ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఆ అరుదైన క్లబ్‌లోకి సన్‌రైజర్స్ త్రయం అడుగుపెట్టింది.
మరోవైపు టీ20 క్రికెట్ చరిత్రలోనే ఐపీఎల్‌లో అత్యధికంగా ఆరు సార్లు 250కు పైగా (250+) స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పాటు సన్‌రైజర్స్ మిడిలార్డర్ హెన్రిచ్ క్లాసెన్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒకే ఐపీఎల్ సీజన్‌లో కేవలం నాల్గవ స్థానంలో (No. 4) బ్యాటింగ్‌కు వచ్చి అత్యధికంగా 606 పరుగులు చేసిన ప్లేయర్‌గా క్లాసెన్ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆరెంజ్ ఆర్మీ సమిష్టిగా కదిలి చేసిన ఈ పరుగుల వేటతో ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అద్భుతమైన రికార్డులు హైదరాబాద్ ఖాతాలో చేరాయి.






