- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లపై వైభవ్ ను ప్రయోగించడం పక్కా..బీసీసీఐ ప్లాన్ లీక్ చేసిన గవాస్కర్
ఇంగ్లాండ్ పై వైభవ్ ను ప్రయోగించడం పక్కా అంటూ బీసీసీఐ ప్లాన్ లీక్ చేశారు గవాస్కర్.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న హైదరాబాద్ పైన ఆడిన భయంకరమైన ఇన్నింగ్స్ నేపథ్యంలో, అతన్ని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అటు విదేశీ క్రికెటర్లు కూడా.. వైభవ్ బ్యాటింగ్ విధానాన్ని ఈ మెచ్చుకుంటున్నారు. హెడెన్ లాంటి భయంకరమైన బ్యాటర్లతో వైభవ్ సూర్యవంశీని పోల్చుతున్నారు.
ఈ క్రమంలో భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు వస్తాడనే దానిపైన సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూలైలో జరిగే ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోసం వైభవ్ ను బీసీసీఐ సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. అప్పటి వరకు అతన్ని బీసీసీఐ దాచిపెడుతుందని వెల్లడించారు. ఇంగ్లాండ్ జట్టును ఓడించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సీక్రెట్ లీక్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జూలై మాసంలో ఐదు టీ20 సిరీస్ జరగనుంది. జూలై ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ వేదికగా ఈ టీ20 సిరీస్ జరుగుతుంది.






