- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL 2026: సుదర్శన్-సుందర్ సత్తా.. కానీ కట్టడి చేసిన హైదరాబాద్ బౌలర్లు..!
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తర పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తర పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు గుజరాత్ టైటాన్స్ 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు.
సుదర్శన్, సుందర్ హాఫ్ సెంచరీలు..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (5) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ, సాయి సుదర్శన్ (61; 44 బంతుల్లో) బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ (50) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో గుజరాత్ కోలుకుంది. ముఖ్యంగా 19వ ఓవర్లో సుందర్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో ఏకంగా 18 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 5 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
కట్టుదిట్టంగా హైదరాబాద్ బౌలింగ్
సన్‌రైజర్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు, ప్రఫుల్ హింగే 2 వికెట్లు, పాట్ కమిన్స్ 1 వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. గుజరాత్ గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో జోరుమీదుండగా, వారిని కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు సత్తా చాటారు. సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ లక్ష్యాన్ని ఛేదించి టేబుల్ టాపర్లుగా నిలుస్తారో లేదో చూడాలి!






