- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్సీబీ ఘోర ఓటమి..గెలిచిన సన్ రైజర్స్ కు నిరాశ
ఆర్సీబీ ఘోర ఓటమి పాలైంది. సన్ రైజర్స్ చేతిలో దారుణంగా ఓడింది.

దిశ, వెబ్ డెస్క్: ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘోరంగా ఓడిపోయింది. చివరి లీగ్ మ్యాచ్ నేపథ్యంలో బెంగళూరుపైన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బెంగుళూరు పైన ఏకంగా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగుళూరు, పోరాడి ఓడిపోయింది. వెంకటేష్ అయ్యర్ 44, రజత్ పాటిదార్ 56, కృనాల్ 41 పరుగులతో రాణించినప్పటికీ బెంగుళూరు ఓటమిపాలైంది. దీంతో హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
SRH కు నిరాశే మిగిలింది
ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గెలిచినప్పటికీ SRH కు నిరాశే ఎదురయింది. పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 2 స్థానానికి చేరుకునేందుకు బెంగుళూరును 160 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉండగా...SRH విఫలమైంది. ఈ క్రమంలో మూడో స్థానానికి పరిమితమైన హైదరాబాద్, ఎలిమినేటర్ 1 మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. నాలుగో స్థానం కోసం నాలుగు జట్ల మధ్య పోటీ నెలకొంది. అందులో ఏ జట్టు ఫైనల్ అవుతుందో చూడాలి. ఇక అటు మే 26వ తేదీన బెంగుళూరు వర్సెస్ గుజరాత్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఉంటుంది. ఇందులో గెలిచిన వాళ్ళు ఫైనల్ కు వెళ్తారు. ఓడిన జట్టుకు క్వాలిఫైయర్ 2 అవకాశం ఉంటుంది. ఇక మే 31వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.






