ముంబై ఓటమి.. హైదరాబాద్ సూపర్ విక్టరీ

by Muthe.Rajitha |

IPL లో నేడు MI, SRH జట్ల మధ్య జరిగిన పోరులో ఆరెంజ్ ఆర్మీ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.

ముంబై ఓటమి.. హైదరాబాద్ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : వాంఖడే స్టేడియంలో హైదరాబాద్ బ్యాటర్లు వీర విహారం చేసారు. IPL లో నేడు ముంబై ఇండియన్స్(MI), హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) జట్ల మధ్య జరిగిన పోరులో ఆరెంజ్ ఆర్మీ 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన MI నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. రికెల్టన్(123) పరుగులతో చెలరేగిపోగా.. విల్ జాక్స్(46), హార్దిక్(31) పరుగులు చేసారు. అనంతరం 244 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ ఓపెనర్లు ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. పవర్ ప్లే లోనే ఒక్క వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసారు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ. హెడ్(76), అభిషేక్(45) క్లాసేన్(65*) పరుగులతో జట్టు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగా.. 18.4 ఓవర్లలోనే SRH తన లక్ష్యాన్ని చేధించింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుస ఐదో విజయం కాగా.. ముంబైకి ఇది ఆరో ఓటమి.

Next Story