- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెన్నై చిత్తు.. ప్లేఆఫ్‌కు హైదరాబాద్
IPL లో నేడు చెన్నైని హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : IPL లో నేడు చెన్నైని హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి, ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది. చెపాక్ స్టేడియం వేదికగా.. CSK, SRH మధ్య జరిగిన కీలక మ్యాచులో తొలుత చెన్నై బ్యాటింగుకు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. బ్రెవిస్ 44 పరుగులు చేయగా, కార్తీక్ శర్మ 32 పరుగులతో రాణించారు. చివరలో శివం దూబే 26 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్(70), క్లాసేన్(47), అభిషేక్ శర్మ(26) పరుగులతో రాణించారు. ఈ విజయంతో హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లేఆఫ్‌కు అర్హత సాధించగా.. చెన్నై కూడా ప్లేఆఫ్‌కు చేరాలి అంటే మరో మ్యాచులో గెలిచి,ఇతర జట్ల పర్ఫార్మెన్స్ పై ఆధార పడాలి. ఇక ఈ సీజన్లో గుజరాత్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోగా.. ప్లే ఆఫ్ కు చేరే మరో రెండు జట్లు ఏవి అనేది తేలాల్సి ఉంది.






