వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH! అభిమానులు ఫైర్

by Muthe.Rajitha |   (  Updated:2026-05-24 12:32:48  IST  )

తమకు ఏకైక ఐపీఎల్ కప్ అందించిన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను SRH సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే వార్త తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

వార్నర్‌ను బ్లాక్ చేసిన SRH! అభిమానులు ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ, తమకు ఏకైక ఐపీఎల్ కప్ అందించిన మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే వార్త ఐపీఎల్ అభిమానుల్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తన ఆస్ట్రేలియా తోటి ఆటగాడు, ప్రస్తుత సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను అభినందిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీ పెట్టడానికి ప్రయత్నించిన సమయంలో.. ఎస్‌ఆర్‌హెచ్ అధికారిక పేజీ తనకు కనిపించకపోవడంతో తాను బ్లాక్‌కు గురైన విషయాన్ని వార్నర్ స్వయంగా సోషల్ మీడియా స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టారు. 2021 సీజన్ మధ్యలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ తర్వాత జట్టు నుంచి కూడా తప్పించినప్పటి నుంచి ఫ్రాంచైజీకి, అతనికి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆ సమయంలోనే ఈ బ్లాకింగ్ వ్యవహారం జరిగి ఉంటుందని స్పష్టమవుతోంది.

ఈ విషయం బయటకు రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఫ్రాంచైజీ యాజమాన్యం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రికార్డును అందించడమే కాకుండా, 2016లో ఒంటిచేత్తో టైటిల్ గెలిపించిన ఒక దిగ్గజ ఆటగాడికి ఇలాంటి అవమానం జరగడంపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. సన్ రైజర్స్ జట్టుకు ఎంతో సేవ చేసిన ఆటగాడిని ఇలా దూరం పెట్టడం అభిమానుల తీవ్రంగా గాయపరుస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఈజ్ క్రేజీ.. ఈసారి లక్ష్యం ఐపీఎల్ ట్రోఫీ గెలవడమే: పాట్ కమ్మిన్స్

Next Story