క్యాచ్ వివాదం..అభిషేక్ శర్మకు ఫైన్

by velandi.Saikiran |

అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించింది ఐపీఎల్ క్రికెట్ కౌన్సిల్.

క్యాచ్ వివాదం..అభిషేక్ శర్మకు ఫైన్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సన్ రైజర్స్, కేకేఆర్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఔట్ అయిన విధానం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన నేపథ్యంలో అంపైర్ నిర్ణయంపై సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను నాటౌట్ అంటూ స్టేడియంలో అసహనం వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించింది ఐపీఎల్ క్రికెట్ కౌన్సిల్. కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకుగాను ఒక డీమెరిట్ పాయింట్ విధించినట్లు అధికారికంగా ప్రకటన చేసింది ఐపీఎల్. దీంతో అభిషేక్ శర్మకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

అసలు అభిషేక్ శర్మ క్యాచ్ వివాదం ఏంటి ?

కేకేఆర్, సన్ రైజర్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ, 48 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే అభిషేక్ శర్మకు సంబంధించిన క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి బౌండరీ గేటు దగ్గర అందుకున్నాడు. అతడు బంతిని పట్టుకునే క్రమంలో స్టెప్ అయినట్లు రివ్యూలో కనిపించింది. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం క్లియర్ ఔట్ అని ప్రకటించేశాడు. ఈ నేపథ్యంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు అభిషేక్ శర్మ. దీంతో తాజాగా ఫైన్ విధించింది ఐపీఎల్ క్రికెట్ కౌన్సిల్. కాగా ఈ మ్యాచ్ లో 65 పరుగులు తేడాతో కేకేఆర్ పై సన్ రైజర్స్ విజయం సాధించింది.

Next Story