స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లో చేత‌బ‌డి...షాకింగ్ వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-04-19 06:51:45  IST  )

స‌న్ రైజ‌ర్స్, చెన్నై మ్యాచ్ లో చేత‌బ‌డి చేసిన‌ట్లు షాకింగ్ వీడియో వైర‌ల్ గా మారింది.

స‌న్ రైజ‌ర్స్ మ్యాచ్ లో చేత‌బ‌డి...షాకింగ్ వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: చెన్నై వర్సెస్ హైదరాబాద్ మధ్య శనివారం ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో చివరి వరకు పోరాడిన హైదరాబాద్, పది పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర వీడియో వైరల్ గా మారింది. CSK ఆటగాడు శివమ్ దుబే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ అభిమాని ఒకరు, నిమ్మకాయతో బ్లాక్ మ్యాజిక్ చేసినట్లుగా వీడియో క్రియేట్ చేసి వదిలారు.

నిమ్మకాయ చేతిలో పట్టుకొని మంత్రాలు చదివి బుష్ అనగానే వికెట్ పడిపోవడం ఈ వీడియోలో కనిపించింది. బ్లాక్ మ్యాజిక్ లైవ్ అంటూ పోస్ట్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. బ్లాక్ మ్యాజిక్ కారణంగానే దుబే ఔట్ అయ్యాడని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ కంప్లైంట్ చేయాలంటూ మరికొంతమంది సెటైర్లు పెంచుతున్నారు. మంత్రాల‌కు చింత‌కాయ‌లు కూడా రాల‌బోవ‌ని మ‌రికొంత మంది స్పందిస్త‌న్నారు.

Next Story