స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి..కావ్య మార‌న్ పై దారుణంగా ట్రోల్స్ !

by velandi.Saikiran |

ఎలిమినేట‌ర్ లో స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి పాలైనందుకు కావ్య మార‌న్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి..కావ్య మార‌న్ పై దారుణంగా ట్రోల్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నుంచి SRH నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ చేతులు చిత్తుగా ఓడి, ఇంటిదారి పట్టింది హైదరాబాద్. ముల్లాన్ పూర్ వేదికగా ఈ రెండు జట్లు తలపడగా, రాజస్థాన్ చేతిలో 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది SRH. ఈ క్రమంలో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది హైదరాబాద్. అయితే హైదరాబాద్ ఓడిపోయిన నేపథ్యంలో కావ్య మారన్ ను ఉద్దేశించి దారుణంగా పోస్టులు పెడుతున్నారు చెన్నై ఫ్యాన్స్.

చెన్నై సూపర్ కింగ్స్ పైన మొన్న గెలిచిన తర్వాత దారుణంగా వ్యవహరించిందని కావ్యను ఇప్పుడు టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ఇషాన్ కిషన్, హెడ్, కావ్య అందరూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టును హేళన చేసిన వీడియో ఇప్ప‌టికీ వైర‌ల్ అవుతున్నాయి. దాని ఫలితంగానే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ చేతిలో కావ్య టీమ్ చిత్తుగా ఓడిందని CSK ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దారుణంగా ఆడుకుంటున్నారు. ఓట‌మి బాధ త‌ట్టుకోలేక కావ్య కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఫోటోలను వైరల్ చేస్తున్నారు. చెన్నైని అవమానించిన వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుందని ఆ జట్టు అభిమానులు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ న‌గ‌రంలో ఉంటున్న మ‌రి కొంత‌మంది కూడా కావ్య కోపంగా ఫోటోలను చూపిస్తూ హేళ‌న చేశారు. ఈ వీడియోలు కూడా వైర‌ల్ గా మారాయి.

Next Story