IPL2026: మ్యాచ్ ముగిశాక స్టేడియం వదిలి వెళ్లొద్దు.. ఫ్యాన్స్‌ కోసం SRH క్రేజీ సర్‌ప్రైజ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-22 12:48:47  IST  )

ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

IPL2026: మ్యాచ్ ముగిశాక స్టేడియం వదిలి వెళ్లొద్దు.. ఫ్యాన్స్‌ కోసం SRH క్రేజీ సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఆరెంజ్ ఆర్మీ తలపడనుంది. అయితే, ఈ సీజన్లో ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్‌కు ఇదే చివరి హోమ్ మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ సీజన్ పొడవునా తమకు లభించిన అపూర్వమైన ఆదరణకు గానూ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయించింది. హోమ్ గ్రౌండ్ ప్రతి మ్యాచ్కు స్టేడియంకు భారీ సంఖ్యలో తరలివచ్చి.. జట్టును ' ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన ప్రేక్షకులకు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపాలని టీమ్ ప్లాన్ చేసింది.

స్టేడియం వదిలి వెళ్లొద్దు..

ఈ రోజు ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన వెంటనే అభిమానులందరూ ఎవరూ స్టేడియం వదిలి వెళ్లకుండా, తమ తమ స్టాండ్స్లోనే వేచి ఉండాలని సన్‌రైజర్స్ యాజమాన్యం ప్రత్యేకంగా కోరింది. మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ అంతా కలిసి మైదానం చుట్టూ తిరుగుతూ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేసే “వన్ లాస్ట్ ల్యాప్ సెరమనీ" (One Last Lap Ceremony) నిర్వహించనున్నారు. తమ అభిమాన ఆటగాళ్లను చాలా దగ్గరగా చూసేందుకు, ఈ సీజన్ హోమ్ జర్నీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఇదొక సువర్ణావకాశం కావడంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నేడు ఉప్పల్ మైదానంలో ఆర్సీబీతో మ్యాచ్ పాటు ఈ ప్రత్యేక ఈవెంట్ కూడా హైలైట్గా నిలవనుంది.

Next Story